Skip to main content

రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్‌లాండ్ పెట్టుబడులు

తెలంగాణలో రబ్బర్‌వుడ్ పరిశ్రమ రంగంలో థాయ్‌లాండ్ భారీ పెట్టుబడులు పెట్టనుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు.
Current Affairsహైదరాబాద్‌లో జనవరి 18న జరిగిన జరిగిన ఇండియా-థాయ్‌లాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్‌వర్కింగ్ సెమినార్‌లో థాయ్‌లాండ్ ఉప ప్రధాని జురిన్ లక్సనావిసిత్‌తో కలసి తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కె.తారక రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... రబ్బర్‌వుడ్ పరిశ్రమలో థాయ్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల రవాణా కోసం 400 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు ఉందని, రవాణా సబ్సిడీలు కూడా థాయ్ కంపెనీలకు అందిస్తామన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రబ్బర్‌వుడ్ పరిశ్రమలో పెట్టుబడులు
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : థాయ్‌లాండ్ ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ

మాదిరి ప్రశ్నలు
Published date : 20 Jan 2020 05:56PM

Photo Stories