రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
Sakshi Education
రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫిబ్రవ రి 5న వెల్లడించారు.
వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్ నేషనల్ శాంపుల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) కాలంలో అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 ఏడాది కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్ ఎన్‌ఎస్‌ఎస్ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
ఎప్పుడు : ఫిబ్రవ రి 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
ఎప్పుడు : ఫిబ్రవ రి 5
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 07 Feb 2019 05:55PM