రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించనున్న వర్సిటీ?
Sakshi Education
అన్నదాతల కోసం దేశంలోనే ప్రయోగాత్మకంగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం... ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది.
‘ఉద్యాన వాణి’ పేరిట 2 నెలలుగా ప్రయోగాత్మకంగా రైతు కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఈ రేడియో స్టేషన్ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. రైతుల కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమం. ఈ రేడియో స్టేషన్ ద్వారా వర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రత్యేకంగా రేడియో స్టేషన్‌ను ప్రారంభించనున్న వర్సిటీ?
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : వర్సిటీ ఆధ్వర్యంలో చేసిన పరిశోధనల ఫలితాలు, అభివృద్ధి చేసిన సాంకేతిక విధానాలతోపాటు ఆధునిక సేద్య సమాచారాన్ని నేరుగా రైతులకు అందించేందుకు

Published date : 15 Mar 2021 06:09PM