Skip to main content

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లోగో మార్పు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 2020లో కొత్త లోగోతో బరిలోకి దిగనుంది.
Current Affairsఈ సారి తమ జట్టు లోగోను మార్చుతున్నట్లు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ ఫిబ్రవరి 14న ప్రకటించింది. సింహం బొమ్మ హైలైట్ అవుతూ జట్టు పూర్తి పేరు లోగోపై ఉంటుంది. ‘సింహం బొమ్మ నిర్భీతికి, దూకుడుకు సంకేతం. అభిమానుల ఉత్సాహం పెంచేందుకు టీమ్‌కు కొత్త రూపం రావడం మంచిదని మేం భావించాం. అందుకే ఈ మార్పు’ అని ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురీవాలా వెల్లడించారు.

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు రజతాలు
ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ కె.వి.ఎల్. పావని కుమారి ఈ రెండు పతకాలు సాధించింది. 45 కేజీల విభాగంలో పోటీపడిన విశాఖపట్నం జిల్లా లిఫ్టర్ పావని యూత్, జూనియర్ కేటగిరీల్లో మొత్తం 145 కేజీలు (స్నాచ్‌లో 66+క్లీన్ అండ్ జెర్క్‌లో 79) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 20 దేశాల నుంచి 197 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లోగో మార్పు
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురీవాలా
Published date : 15 Feb 2020 05:56PM

Photo Stories