రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటవుతోంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వ్యాక్సినేషన్ తయారీ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఇండస్ జీన్ ఎక్స్‌ప్రెషన్స్ లిమిటెడ్ రూ.720 కోట్లతో బయో టెక్నాలజీ యూనిట్‌ను నెలకొల్పుతోంది.
మొత్తం 3 దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్ తొలి దశ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో రూ.220 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావచ్చాయి. ఇక్కడ సిద్ధమవుతున్న బయో టెక్నాలజీ యూనిట్ ద్వారా క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఎక్కడ ఏర్పాటవుతోంది?
ఎప్పుడు : జూలై 5
ఎవరు : ఇండస్ జీన్ ఎక్స్‌ప్రెషన్స్ లిమిటెడ్
ఎక్కడ : కోడూరు, చిలమత్తూరు మండలం, అనంతపురం జిల్లా
ఎందుకు : క్యాన్సర్, ఆర్థరైటిస్, మధుమేహం వంటి వ్యాధులపై పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు...

Published date : 06 Jul 2021 06:25PM