Skip to main content

రాజ్యసభ సభ్యుడు అమర్‌సింగ్‌ కన్నుమూత

రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత అమర్‌సింగ్‌(64) కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి ఆగస్టు 1న తుదిశ్వాస విడిచారు.
Edu news1956 జనవరి 27న ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్ సింగ్ యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్‌పీలో కీలక నేతగా కొనసాగారు. ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. 2016లో ఎస్‌పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికైన అమర్ సింగ్ 2016లో తిరిగి ఎస్‌పీ చేరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఎస్‌పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్‌ యాదవ్‌ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్‌ఎస్‌ఎస్‌కు విరాళంగా అందజేస్తానని అమర్ సింగ్ ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేతకన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 1
ఎవరు : అమర్‌సింగ్‌(64)
ఎక్కడ : సింగపూర్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 04 Aug 2020 11:58AM

Photo Stories