Skip to main content

ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన క్వాలిఫయర్?

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో సెమీఫైనల్ దశకు చేరిన తొలి క్వాలిఫయర్‌గా అర్జెంటీనాకి చెందిన నదియా పొడొరోస్కా రికార్డు నెలకొల్పింది.
Current Affairs
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్టోబర్ 6న జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 131వ ర్యాంకర్ పొడొరోస్కా 79 నిమిషాల్లో 6-2, 6-4తో మూడో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఈ క్రమంలో 23 ఏళ్ల పొడొరోస్కా ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి క్వాలిఫయర్‌గా నిలిచింది. అలాగే 2004 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి అర్జెంటీనా క్రీడాకారిణిగా నిలిచింది. చివరిసారి అర్జెంటీనా తరఫున 2004లో పౌలా సురెజ్ ఈ ఘనత సాధించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన క్వాలిఫయర్
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : నదియా పొడొరోస్కా
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 08 Oct 2020 11:30AM

Photo Stories