Skip to main content

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా

ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు-2019(ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్)’’ జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు.
Current Affairsఫోర్బ్స్ డిసెంబర్ 12న విడుదల చేసిన ఈ జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా 34వ స్థానంలో నిలిచారు. గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన నిర్మలా.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు.

భారత్ నుంచి మరో ఇద్దరు
ఫోర్బ్స్ మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ మహిళలకు స్థానం లభించింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రెజైస్ ఎగ్జిక్యూ టివ్ డెరైక్టర్, సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 54వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు.

అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్
ఫోర్బ్స్ మహిళల జాబితాలో 2019 ఏడాది కూడా జర్మనీ చాన్‌‌సలర్ ఏంజెలా మెర్కల్ అగ్రస్థానంలో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమె తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. ఈ జాబితాలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్‌‌డ రెండో స్థానం పొందగా... అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో ఉన్నారు.

ఫోర్‌‌బ్స అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు
ర్యాంక్ పేరు దేశం
1 ఏంజెలా మెర్కల్ జర్మనీ
2 క్రిస్టీనా లగార్‌‌డ {ఫాన్‌‌స
3 నాన్సీ పెలోసీ అమెరికా
4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ బెల్జియం
5 మేరీ బరా అమెరికా
29 షేక్ హసీనా బంగ్లాదేశ్
34 నిర్మలా సీతారామన్ భారత్
42 ఇవాంకా ట్రంప్ అమెరికా
54 రోష్ని నాడార్ మల్హోత్రా భారత్
65 కిరణ్ మజుందార్ షా భారత్
100 గ్రేటా థన్‌బర్గ్ స్వీడన్

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫోర్‌‌బ్స అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు-2019 జాబితాలో 34వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Published date : 14 Dec 2019 05:24PM

Photo Stories