ఫ్లో రెజ్లింగ్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయ క్రీడాకారుడు?
68 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ హరియాణా రెజ్లర్ అజేయంగా నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఎనిమిది మంది రెజ్లర్ల మధ్య నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో బజరంగ్ 8-4తో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత జేమ్స్ గ్రీన్ (అమెరికా)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన బజరంగ్‌కు 25 వేల డాలర్లు (రూ. 18 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది.
65 కేజీల విభాగంలో...
బజరంగ్ రెగ్యులర్‌గా 65 కేజీల విభాగంలో... జేమ్స్ గ్రీన్ 70 కేజీల విభాగాల్లో పోటీపడతారు. 2019 ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన బజరంగ్ 2021 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్లో రెజ్లింగ్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ క్లబ్ టోర్నీలో విజేతగా నిలిచిన భారతీయుడు
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : బజరంగ్ పూనియా
ఎక్కడ : ఆస్టిన్ నగరం, అమెరికా