ఫార్ములావన్ చరిత్రలో 1000 రేసుల్లో పాల్గొన్న తొలి జట్టు?
ఇటలీలోని టస్కన్ పట్టణంలో సెప్టెంబర్ 13న జరిగిన టస్కన్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్‌లెర్క్ 5వ స్థానం నుంచి... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ 14వ స్థానం నుంచి ప్రారంభించారు.
ఎఫ్1 మొదలైనప్పటి నుంచి...
1950లో ఎఫ్1 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ క్రీడలో ఫెరారీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 999 రేసుల్లో పాల్గొన్న ఫెరారీ జట్టు డ్రైవర్లు 238 రేసుల్లో విజేతగా నిలిచారు. ఎఫ్1 క్రీడలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ఫెరారీకే గుర్తింపు ఉంది. విఖ్యాత డ్రైవర్ మైకేల్ షుమాకర్ పదేళ్లపాటు (1996-2006) ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఆ జట్టుకు 72 విజయాలు అందించాడు. 871 రేసులతో ఫెరారీ జట్టు తర్వాత మెక్‌లారెన్ (బ్రిటన్) జట్టు రెండో స్థానంలో ఉంది. మెక్‌లారెన్ జట్టు డ్రైవర్లు 182 రేసుల్లో విజయం సాధించారు.
చదవండి: టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు-ఫలితాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ చరిత్రలో 1000 రేసుల్లో పాల్గొన్న తొలి జట్టు
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఫెరారీ
ఎక్కడ : టస్కన్ పట్టణం, ఇటలీ