Skip to main content

ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం

బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది.
Current Affairsభారత వ్యవసాయ పరిశోధనల సమాఖ్య (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర జనవరి 6న ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మహాపాత్ర ప్రసంగిస్తూ... రైతులు తమ సొంత ఖర్చులతో చేపట్టిన పరిశోధనలు, ఆవిష్కరణలను శాస్త్రీయంగా ప్రామాణీకరించేందుకు, కొత్త కొత్త ఆవిష్కరణలను అందరికీ చేరువ చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఫార్మర్స్ ఇన్నోవేషన్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంలో యువత పాత్ర పెంచేందుకు ఐసీఏఆర్ ‘ఆర్య’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫార్మర్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : ఐసీఏఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక

మాదిరి ప్రశ్నలు
Published date : 07 Jan 2020 05:47PM

Photo Stories