పుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2019-20 గెలుచుకున్న ఆటగాడు?
Sakshi Education
అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అవార్డుల్లో 2019-20 సంవత్సరానికి గానూ పురుషుల విభాగంలో గోల్ కీపర్ గుర్‌ప్రీత్, మహిళల కేటగిరీలో మిడ్‌ఫీల్డర్ సంజు ‘ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెలుచుకున్నారు.
అలాగే రతన్‌బాలాదేవి ‘ఎమర్జింగ్ మహిళా ఫుట్‌బాలర్’గా నిలిచింది. తొలిసారిగా ఈ పురస్కారానికి ఎంపికై న 28 ఏళ్ల గుర్‌ప్రీత్... 2009లో సుబ్రతా పాల్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో గోల్‌కీపర్‌గా నిలిచాడు. ‘కెప్టెన్ సునీల్ ఛెత్రీ ఈ అవార్డును చాలాసార్లు గెలుపొందాడు. తనని చూసి నేను కూడా ఈ అవార్డు అందుకునే స్థాయికి ఎదగాలని ఆశించా’ అని గుర్‌ప్రీత్ వ్యాఖ్యానించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2019-20 విజేతలు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : పురుషుల విభాగంలో గోల్ కీపర్ గుర్‌ప్రీత్, మహిళల కేటగిరీలో మిడ్‌ఫీల్డర్ సంజు
క్విక్ రివ్యూ :
ఏమిటి : పుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2019-20 విజేతలు
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : పురుషుల విభాగంలో గోల్ కీపర్ గుర్‌ప్రీత్, మహిళల కేటగిరీలో మిడ్‌ఫీల్డర్ సంజు
Published date : 26 Sep 2020 05:15PM