పులివెందులలో 24 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sakshi Education
పులివెందులకు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కళాశాలలను మంజూరు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.1,329 కోట్లతో చేపట్టిన 24 అభివృద్ధి పనులకు డిసెంబర్ 25న ఆయన పులివెందుల ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పులివెందులలో తొలివిడతగా ఈ పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గండికోట ప్రాజెక్టు దిగువన ముద్దనూరు మండలం ఆరవేటిపల్లె, దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మిస్తామన్నారు. ముద్దనూరు - కొడికొండ చెక్‌పోస్టు (పులివెందుల-బెంగుళూరు) రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు.
Published date : 26 Dec 2019 05:52PM