పుగలుర్-త్రిస్సూర్ పవర్ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టు ప్రారంభం
Sakshi Education
320 కేవీ పుగలుర్(తమిళనాడు)- త్రిస్సూర్(కేరళ) పవర్ ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
ఫిబ్రవరి 19న ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 5,070 కోట్లు వ్యయం చేశారు. రానున్న ఆరేళ్లలో దేశ సౌర విద్యుత్ సామర్థ్ధ్యం 13 రెట్లు పెరగనుందని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఫిబ్రవరి 19న ప్రధాని ఆన్‌లైన్ విధానంలో పాల్గొని, ప్రసంగించారు. రానున్న 25 ఏళ్లలో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను పెంచేందుకు విద్యాసంస్థలు చేపట్టాల్సిన చర్యలపై 25 అంశాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని కోరారు. విశ్వభారతి యూనివర్సిటీని కోల్‌కతాలోని శాంతినికేతన్‌లో 1921, డిసెంబర్ 23న విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు.

Published date : 20 Feb 2021 05:57PM