పృథ్వి-2 రాత్రిపూట ప్రయోగం విజయవంతం
Sakshi Education
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన అణు క్షిపణి పృథ్వి-2 రాత్రిపూట ప్రయోగం విజయవంతమైంది.
రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఒడిశాలోని బాలాసోర్‌లో నవంబర్ 20న రెండు పృథ్వి-2 క్షిపణులను ప్రయోగించారు. ఆర్మీ సాధారణ ట్రయల్‌లో భాగంగానే ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఇంటీరియం టెస్ట్ రేంజ్ అధికారులు తెలిపారు. పృథ్వి-2 క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 నుంచి 1000 కేజీల అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. 2018లో కూడా పృథ్వి-2 రాత్రిపూట ప్రయోగం నిర్వహించి విజయం సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పృథ్వి-2 రాత్రిపూట ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)
ఎక్కడ : బాలాసోర్, ఒడిశా
క్విక్ రివ్యూ :
ఏమిటి : పృథ్వి-2 రాత్రిపూట ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)
ఎక్కడ : బాలాసోర్, ఒడిశా
Published date : 21 Nov 2019 06:04PM