ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
2021లో 20.6 శాతం వృద్ధి...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్-2021 మార్చి) ఎకానమీ 9.5 శాతం క్షీణిస్తుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2021 ఏప్రిల్-2021 జూన్) భారీగా 20.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
ఆర్‌బీఐ పాలసీ రేట్ల తీరు ఇదీ..
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
చిన్న పరిశ్రమలకు ఊరట...
రిటైల్ రుణ గ్రహీతలు, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు అందించే విషయంలో బ్యాంకులకు మరింత వెసులుబాటు లభించింది. ఇందుకు సంబంధించిన పరిమితిని (ఫండ్ అండ్ నాన్-ఫండ్ ఆధారిత) రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు ఆర్‌బీఐ పెంచింది.
ఎగుమతిదారులకు వరం...
విదేశీ కొనుగోలుదారులతో ఎగుమతిదారులు మరింత మెరుగైన రీతిన లావాదేవీలు నిర్వహించేందుకు ‘సిస్టమ్ ఆధారిత ఆటోమేటిక్ కాషన్ లిస్టింగ్’ను ఆర్‌బీఐ మినహాయించింది. దీంతో ఎగుమతుల ద్వారా సముపార్జించిన మొత్తాన్ని మరింత సులభతరమైన రీతిలో అందుకోగలుగుతారు. ఆటోమేషన్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (ఈడీపీఎంఎస్)- ‘కాషన్/డీ-కాషన్ లిస్టింగ్‌ను 2016లో ప్రవేశపెట్టారు.