ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
Sakshi Education
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో సమావేశమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఏప్రిల్ 7న ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
వృద్ధి 10.5 శాతం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్‌బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ద్రవ్యోల్బణం నియంత్రణలోనే..
రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంగా ఉంది.
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐ రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతథంగా కొనసాగింపు
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని...

Published date : 08 Apr 2021 05:44PM