Skip to main content

ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన నేత?

ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశ ప్రధాన మంత్రిగా కొనసాగిన బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) నవంబర్ 11న కన్నుమూశారు.
Current Affairs
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం, రోచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్లకు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో 1935, నవంబర్ 24న ఖలీఫా జన్మించారు. బహ్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన 1971, ఆగస్టు 15కు ఒక ఏడాది ముందు నుంచే(1970, జనవరి 10) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 50 ఏళ్లు ప్రధానిగా పనిచేసి, ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

బహ్రెయిన్ రాజధాని: మనామా
కరెన్సీ: బహ్రెయిన్ దినార్

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన నేత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84)
ఎక్కడ : మేయో క్లినిక్, రోచెస్టర్, మిన్నెసోటా రాష్ట్రం, అమెరికా
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 12 Nov 2020 05:32PM

Photo Stories