ప్రపంచంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరం?
చెన్నై తర్వాత తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలో, చైనాలోని హర్బిన్ మూడో స్థానంలో ఉన్నాయి. యూకేకి చెందిన ‘సర్ఫ్‌షార్క్’సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా తీసుకున్న సర్ఫ్‌షార్క్ సంస్థ 130 నగరాలతో ఈ నివేదికను రూపొందించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచదేశాలతో పోలిస్తే చైనా, భారత్ ముందున్నాయని నివేదిక పేర్కొంది.
అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాలు...
ర్యాంకు | నగరం | సీసీ కెమెరా (చ.కి.మీకు) | సీసీ కెమెరా(1,000 మందికి) |
1 | చెన్నై(భారత్) | 657 | 25.5 |
2 | హైదరాబాద్ (భారత్) | 480 | 30.0 |
3 | హర్బిన్ (చైనా) | 411 | 39.1 |
4 | లండన్ (బ్రిటన్) | 399 | 67.5 |
5 | గ్జియామెన్ (చైనా) | 385 | 40.3 |
6 | చెంగ్డూ (చైనా) | 350 | 33.9 |
7 | తైయువాన్ (చైనా) | 319 | 119.6 |
8 | ఢిల్లీ(భారత్) | 289 | 14.2 |
9 | కున్మింగ్ (చైనా) | 281 | 45.0 |
10 | బీజింగ్ (చైనా) | 278 | 56.2 |
క్విక్ రివ్యూ :
ఏమిటి : చదరపు కిలోమీటరుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య, అక్కడి జనాభాను ప్రామాణికంగా... అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో చెన్నైకి అగ్రస్థానం
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : సర్ఫ్‌షార్క్ సంస్థ
ఎక్కడ : ప్రపంచంలో