Skip to main content

ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా ముంబై

ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది.
ఈ మేరకు జూన్ 5న ట్రాఫిక్ ఇండెక్స్-2018ని టామ్ టామ్ సంస్థ విడుదల చేసింది. వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక పేర్కొంది. ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్‌లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నట్టు టామ్ టామ్ వివరించింది.

టామ్ టామ్ నివేదిక ప్రకారం ముంబై తర్వాత కొలంబియారాజధాని బొగోటా(63 శాతం), పెరూ రాజధాని లిమా(58 శాతం) నగరాల్లో అధిక టాఫిక్ జామ్ ఉంది. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీ 58 శాతం ట్రాఫిక్‌తో నాలుగో స్థానంలో నిలవగా, రష్యా రాజధాని 56 శాతంతో ఐదో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని జీపీఎస్ ఆధారంగా టామ్ టామ్ అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. అయితే 8 లక్షల జనాభాకు పైబడిన నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు. వాహనాల రద్దీపై గత పదేళ్లుగా అధ్యయనం చేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా భారతదేశంలోని వాహన రద్దీ స్థాయిని అంచనా వేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా ముంబై
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2018
Published date : 06 Jun 2019 05:51PM

Photo Stories