ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం: ఏడీబీ
గ్లోబల్ జీడీపీలో ఇది 2.3–4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఏప్రిల్ 3న ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) నివేదికను విడుదల చేసింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
భారత వృద్ధి రేటు 4 శాతం..
అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత(2020-21) ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏడీబీ అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని తెలిపింది. ప్రస్తుతం ఏడీబీ ప్రెసిడెంట్‌గా మసాత్సుగు అసకావా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు : కరోనా మహమ్మారి కారణంగా