ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మారడోనా ఇకలేరు
Sakshi Education
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (60) ఇకలేరు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం ఇకలేరు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : డీగో మారడోనా (60)
ఎక్కడ : టీగ్రె, బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
ఎందుకు : గుండెపోటు కారణంగా
గుండెపోటు కారణంగా నవంబర్ 25న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు సమీపంలోని టీగ్రె పట్టణంలో తుదిశ్వాస విడిచారు. ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా ఆయన వ్యవహరిస్తున్నాడు.
డీగో మారడోనా ప్రస్థానం...
- పుట్టిన తేదీ: అక్టోబర్ 30, 1960
- పుట్టిన స్థలం: బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
- 1976 అర్జెంటీనా జూనియర్ జట్టులో స్థానం, అరంగేట్రం
- 1977 అర్జెంటీనా సీనియర్ జట్టులో చోటు
- 1986 మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా బరిలోకి దిగి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనాకు 2-1తో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మారడోనా సాధించిన రెండు గోల్స్ చరిత్రలో నిలిచిపోయాయి.
- 1994 అమెరికాలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో దొరికిపోయాడు. టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పంపించారు. 15 నెలలపాటు సస్పెన్షన్.
- 1997 రివర్ ప్లేట్ క్లబ్‌తో కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు.
- 2000 కొకై న్ అడిక్షన్ నుంచి విముక్తికి క్యూబాలో రిహాబిలిటేషన్.
- 2005 సొంత టీవీ కార్యక్రమం నిర్వహించాడు.
- 2008-2010 రెండేళ్లపాటు అర్జెంటీనా జాతీయ సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2010 ప్రపంచకప్‌లో మారడోనా కోచ్‌గా ఉన్న అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది.
- నవంబర్ 25, 2020 గుండెపోటుతో బ్యూనస్ ఎయిర్స్‌లో కన్నుమూత
ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా...
- ఆడిన మ్యాచ్‌లు: 585
- చేసిన గోల్స్: 311
- గెలిచిన టైటిల్స్: 9
అర్జెంటీనా తరఫున...
- ఆడిన మ్యాచ్‌లు 91
- చేసిన గోల్స్ 34
- ఆడిన ప్రపంచకప్‌లు 4; 1982: రెండో రౌండ్‌లో నిష్క్రమణ; 1986: విజేత 1990: రన్నరప్; 1994: ప్రిక్వార్టర్ ప్రిక్వార్టర్ ఫైనల్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం ఇకలేరు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : డీగో మారడోనా (60)
ఎక్కడ : టీగ్రె, బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 26 Nov 2020 06:09PM