ప్రపంచ జీడీపీ 2030 నాటికి 140 ట్రిలియన్ డాలర్లు
ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2030 నాటికి 6.5 ట్రిలియన్ డాలర్లు పెరిగి 140 ట్రిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. నైపుణ్య రంగంలో భారీ పెట్టుబడులు ఇందుకు దోహదపడతాయని పేర్కొంది. అమెరికా, చైనా తర్వాత కేవలం భారత్‌లో 570 బిలియన్ డాలర్లు (రూ.40 లక్షల కోట్ల) జీడీపీ పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. ఈ మేరకు జనవరి 25న ఒక నివేదికను విడుదల చేసింది.
ఆన్‌లైన్ దావోస్ అజెండా సమ్మిట్-2021 సందర్బంగా తాజా అధ్యయన నివేదికను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. 2021, జనవరి 24 నుంచి 29 వరకు జరిగే ఈ దావోస్ ఆన్‌లైన్ సదస్సులో సుమారు 1,000 మంది పైగా ప్రపంచ దేశాల నేతలు, దిగ్గజ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ జీడీపీ 2030 నాటికి 140 ట్రిలియన్‌లకు చేరుకునే అవకాశం ఉంది
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నివేదిక
ఎందుకు : నైపుణ్య రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉన్నందున