Skip to main content

ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ శెట్టర్ కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ ఎస్.శెట్టర్ (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 28న బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
Current Affairsకర్ణాటకలోని బళ్లారి జిల్లా హంస సాగరలో జన్మించిన షడక్షరీ శెట్టర్ మైసూరు, ధార్వాడ్, కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చరిత్ర, కళలు, పురావస్తు తవ్వకాలు, పర్యాటకం, గ్రాంథిక భాషాంశాలపై 27కు పైగా పరిశోధన గ్రంథాలను రాశారు. వివిధ వర్సిటీల్లో ఆచార్యులుగా సేవలందిస్తూనే 1978-1995 మధ్య కాలంలో భారతీయ కళా చరిత్ర సంస్థకు సంచాలకులుగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

శెట్టర్ ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసర్చ్ అధ్యక్షునిగా, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ స్టడీస్‌లో ఆచార్యులుగా సేవలందించారు. భారతీయ, కర్ణాటక చరిత్ర అనుసంధాన పరిషత్‌లకు అధ్యక్షులుగా వ్యవహరించారు. మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా)లో విశ్వ సంస్కృత సమ్మేళనం విభాగానికి, బళ్లారి జిల్లా సాహిత్య సమ్మేళనాలకు, అఖిల భారత పురాతన కన్నడ (హళేగన్నడ) సాహిత్య సమ్మేళనాలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. కర్ణాటక రాజ్యోత్సవ, కుంద, కేంద్ర సాహిత్య అకాడమి, భాషా సమ్మాన్, మాస్తి, రన్న, 2016 ప్రాచీక కన్నడ వాజ్ఞయ పురస్కారాలను ఆయన అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : డాక్టర్ షడక్షరీ శెట్టర్ (85)
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 29 Feb 2020 05:50PM

Photo Stories