ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ కన్నుమూత
Sakshi Education
ప్రముఖ చిత్రకారుడు, శిల్పి వేణువాద్యకారుడు, పద్మ విభూషణ్ గ్రహీత సతీశ్ గుజ్రాల్ (94) కన్నుమూశారు.
మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు సోదరుడైన సతీశ్ మార్చి 26న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. అవిభాజ్య పంజాబ్‌లో 1925లో జన్మించిన సతీశ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి.
Published date : 28 Mar 2020 06:12PM