ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయం ఏ జిల్లాలో నెలకొని ఉంది?
Sakshi Education
గుజరాత్ రాష్ట్రం గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయంలో రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆగస్టు 20న ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... వివిధ ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా మారిస్తే ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. కేంద్రం తీసుకువచ్చిన ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రెజువెన్షన్ అండ్ స్పిరిచ్యువల్ అగమెంటేషన్ డ్రైవ్) పథకం కింద 40 పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే 15 ఆలయాల్లో పనులు మొదలయ్యాయని చెప్పారు. విధ్వంసకర శక్తులు, ఉగ్ర మూకల ఆధిపత్యం తాత్కాలికమేనని(అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో) అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : సోమ్‌నాథ్ ఆలయం, గిర్ సోమ్‌నాథ్ జిల్లా, గుజరాత్
ఎందుకు : సోమ్‌నాథ్ ఆలయ అభివృద్ధి కోసం...
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.83 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : సోమ్‌నాథ్ ఆలయం, గిర్ సోమ్‌నాథ్ జిల్లా, గుజరాత్
ఎందుకు : సోమ్‌నాథ్ ఆలయ అభివృద్ధి కోసం...
Published date : 21 Aug 2021 05:59PM