Skip to main content

ప్రజాపతి త్రివేదికి హ్యారీ హాట్రీ అవార్డు

లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో సీనియర్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్టాత్మక ‘హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్ పర్ఫార్మన్స్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డు-2019 లభించింది.
అమెరికాలోని వాషింగ్టన్‌లో మార్చి 10న జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెయి (సీఏపీ), అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏఎస్‌పీఏ) ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేశాయి. దీంతో ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా ప్రజాపతి నిలిచారు. 2009-14 మధ్య కాలంలో ప్రజాపతి భారత పీఎంవోలో శాశ్వత కార్యదర్శిగా పనిచేశారు. హ్యారీ హాట్రీ అవార్డును ప్రతి ఏడాదీ ప్రజాపాలన విభాగంలో గణనీయ మార్పులు తెచ్చేందుకు కృషి చేసే వారికి ఇస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్ పర్ఫార్మెయి మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డు-2019
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ప్రజాపతి త్రివేది
ఎందుకు : ప్రజాపాలన విభాగంలో విశేష కృషికిగాను
Published date : 12 Mar 2019 03:37PM

Photo Stories