Skip to main content

ప్రజా గాయకుడు వంగపండుకన్నుమూత

ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు(77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో ఆగస్టు 4న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Edu newsప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లిదంపతులకు 1943 జూన్ లో వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్‌ వార్‌ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలనురచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడుకన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : వంగపండు ప్రసాదరావు(77)
ఎక్కడ : పార్వతీపురం, విజయనగరం జిల్లా
ఎందుకు : గుండెపోటు కారణంగా
Published date : 05 Aug 2020 05:55PM

Photo Stories