Skip to main content

పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు అసెంబ్లీ ఆమోదం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు ఉద్దేశించిన ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు-2020’కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ జనవరి 20న ఆమోదం తెలిపింది.
Current Affairs అలాగే సీఆర్‌డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏఎంఆర్‌డీఏ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది.

ఏపీ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) పరిధిలో శాసన రాజధానిని, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేంద్రంగా జ్యుడిషియల్ రాజధానిని ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేస్తారు.

శాసన రాజధానిలో..
ఏఎంఆర్‌డీఏ పరిధిలోని శాసనపరమైన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసనమండలి ఉంటాయి.

పరిపాలనా రాజధానిలో..
పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రాజ్‌భవన్, సచివాలయం, ప్రభుత్వ శాఖల శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి.

జ్యుడిషియల్ రాజధానిలో..
హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర న్యాయ సంబంధమైన సంస్థలన్నీ సాధ్యమైనంత వరకూ కర్నూలులోనే ఉంటాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లు-2020కు ఆమోదం
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ఎందుకు : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, పరిపాలన వికేంద్రీకరణకు
Published date : 22 Jan 2020 06:27PM

Photo Stories