ప్రధాని మోదీ జ్ఞాపికల వేలం ముగింపు
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న జ్ఞాపికల ప్రదర్శన, ఈ-వేలం అక్టోబర్ 25న ముగిసింది.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో 2019, సెప్టెంబరు 14 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ ప్రదర్శన, వేలం నిర్వహించారు. దీని ద్వారా 2,772 జ్ఞాపికలు అమ్ముడైనట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రదర్శన వేలంలో అతి తక్కువ ధరకు గణేశ్ విగ్రహం రూ.500కు అమ్ముడు పోగా, అత్యంత ఎక్కువ ధరకు గాంధీ చిత్రం రూ.25 లక్షలకు అమ్ముడు పోయింది. ఈ వేలం, ప్రదర్శన ద్వారా వచ్చిన మొత్తాన్ని గంగానది ప్రక్షాళనకు ఉద్దేశించిన ‘నమామి గంగా’మిషన్‌కు విరాళంగా ఇవ్వనున్నారు.
Published date : 26 Oct 2019 05:47PM