Skip to main content

ప్రధాని కార్యాలయంలో మరో అధికారి రాజీనామా

ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో సలహాదారుగా పని చేస్తున్న సీనియర్‌ అధికారి అమర్జీత్‌ సిన్హా ఆగస్టు 2న పదవికి రాజీనామా చేశారు.
అమర్జీత్‌ సిన్హా 1983 బ్యాచ్‌కు చెందిన బిహార్‌ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. 2019లో ఆయన గ్రామీణాభివృద్ధి కార్యదర్శిగా పని చేశారు. పదవీ విరమణ అనంతరం పీఎంఓలో చేరారు. 2021, మార్చిలో ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ పీకే సిన్హా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తమిళనాడు అసెంబ్లీ శతవార్షికోత్సవాలు
చెన్నైలో ఆగస్టు 2న జరిగిన తమిళనాడు అసెంబ్లీ శత వార్షికోత్సవాల్లో రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ పాల్గొన్నారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : పీఎంఓలో సలహాదారుగా పని చేస్తున్న సీనియర్‌ అధికారి రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : అమర్జీత్‌ సిన్హా
Published date : 04 Aug 2021 01:02PM

Photo Stories