Skip to main content

పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్‌ఈవో)గా వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు జనవరి 5న ఉత్తర్వులు జారీచేసింది.
దీంతో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం-2018 కింద దేశ, విదేశాలో ఉన్న మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యా ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా నిలిచారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా విజయ్‌మాల్యా గుర్తింపు
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ముంబైలోని పీఎంఎల్‌ఏ కోర్టు
Published date : 07 Jan 2019 04:02PM

Photo Stories