పోలాండ్ చెస్‌లో వ్రోక్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారత జీఎం?
Sakshi Education
పోలాండ్ చెస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ప్రాతినిధ్యం వహించిన వ్రోక్లా పొలోనియా జట్టుకు టైటిల్ లభించింది.
పోలాండ్‌లోని క్రాకౌ సెప్టెంబర్ 4న నగరంలో ముగిసిన ఈ టోర్నీలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొన్నాయి. హరికృష్ణ జట్టు మొత్తం 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. హరికృష్ణ ఈ టోర్నీలో మూడు గేముల్లో గెలిచి, ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 15 పాయింట్లతో వాస్కో కటోవైస్ జట్టు రెండో స్థానంలో, 14 పాయింట్లతో స్టిలోన్ గార్జౌ జట్టు మూడో స్థానంలో నిలిచాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలాండ్ చెస్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : వ్రోక్లా పొలోనియా జట్టు
ఎక్కడ : క్రాకౌ, పోలాండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోలాండ్ చెస్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : వ్రోక్లా పొలోనియా జట్టు
ఎక్కడ : క్రాకౌ, పోలాండ్
Published date : 05 Sep 2020 05:13PM