Skip to main content

పని విద్య సదస్సు ముగింపులో ఉప రాష్ట్రపతి

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నయ్ తాలిమ్ (పని విద్య)పై రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఫిబ్రవరి 28న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ) ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తాలిమ్ (పని విద్య) సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్
Published date : 01 Mar 2019 05:47PM

Photo Stories