Skip to main content

పంట వ్యర్థాల దహనంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు

ఢిల్లీ-దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్)లో వాయు నాణ్యత కనిష్ట స్థాయిలకు పడిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Current Affairs
ఈ విషయమై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిటీని అక్టోబర్ 16న ఏర్పాటు చేసింది. గాలి కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు పంజాబ్, హరియాణా, యూపీ తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీకి సాయంగా నేషనల్ కాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ), నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్‌ఎస్‌ఎస్), భారత్ స్కౌట్స్ కార్యకర్తల సేవలను ఉపయోగించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: ఫిజీ సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ లోకూర్

క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్‌తో ఏకసభ్య కమిటీఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : గాలి కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు పంజాబ్, హరియాణా, యూపీ తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు
Published date : 17 Oct 2020 05:11PM

Photo Stories