ప్లాస్మాతో తొలిసారిగా కొవిడ్-19 చికిత్స
Sakshi Education
కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి దేశంలోనే తొలిసారిగా ‘కాన్వలసెంట్ ప్లాస్మా’ను ఉపయోగించాలని కేరళలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) నిర్ణయించింది.
ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో కాన్వలసెంట్ ప్లాస్మా పరిశోధనకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపిందని ఎస్‌సీటీఐఎంఎస్‌టీ డైరెక్టర్ ఆశా కిశోర్ ఏప్రిల్ 9న తెలిపారు. త్వరలో ప్రయోగాలు మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న రోగుల రక్తంలోని ప్లాస్మాలో యాంటీబాడీలు పుష్కలంగా ఉంటాయని, ఇవి కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చెప్పారు. దీంతో కరోనా బారినపడ్డ ఇతర రోగులకు వీటితో చికిత్స చేయడం తమ పరిశోధన ఉద్దేశమని వివరించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఎస్‌సీటీఐఎంఎస్‌టీ పనిచేస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్లాస్మాతో తొలిసారిగా కొవిడ్-19 చికిత్స
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ)
ఎక్కడ : కేరళ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్లాస్మాతో తొలిసారిగా కొవిడ్-19 చికిత్స
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ)
ఎక్కడ : కేరళ
Published date : 10 Apr 2020 06:39PM