పీవీ సింధుతో లి నింగ్ సంస్థ ఒప్పందం
Sakshi Education
భారత టాప్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పూసర్ల వెంకట (పీవీ) సింధుతో చైనాకు చెందిన క్రీడా ఉపకరణాల సంస్థ ‘లి నింగ్’ నాలుగేళ్ల కాలానికి స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం సింధుకు లి నింగ్ సంస్థ రూ. 50 కోట్లు చెల్లించనుంది. ఇందులో రూ.40 కోట్లు స్పాన్సర్‌షిప్ మొత్తంగా... మరో రూ.10 కోట్లు బ్యాడ్మింటన్ క్రీడా సామగ్రి రూపంలో లి నింగ్ అందజేయనుంది. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద ఒప్పందంగా ఇది నిలిచింది. ఒప్పందం ప్రకారం ఇకపై సింధు లి నింగ్‌కు చెందిన క్రీడా ఉత్పత్తులనే వాడాల్సి ఉంటుంది. గతంలో 2014-15లో రెండేళ్ల పాటు సింధుకు స్పాన్సర్‌షిప్ అందించిన లి నింగ్ అప్పట్లో ఏడాదికి కోటిన్నర చొప్పున చెల్లించింది.
మరోవైపు ఇతర భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్ (రెండేళ్లకు రూ. 8 కోట్లు), మను అత్రి, సుమీత్ రెడ్డి (రెండేళ్లకు చెరో రూ. 4 కోట్ల చొప్పున)లతో కూడా లి నింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌తో రూ. 35 కోట్లకు లి నింగ్ ఒప్పందం కుదుర్చుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రీడా ఉపకరణాల సంస్థ లి నింగ్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : పీవీ సింధు

Published date : 09 Feb 2019 05:23PM