Skip to main content

పీటీ ఉషకు వెటరన్ పిన్ పురస్కారం

భారత దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉషకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య (ఐఏఏఎఫ్) నుంచి వెటరన్ పిన్ పురస్కారం లభించింది.
ఖతర్ రాజధాని దోహాలో సెప్టెంబర్ 25న జరిగిన ఐఏఏఎఫ్ కాంగ్రెస్ వేడుకలో సమాఖ్య అధ్యక్షుడు సెబాస్టియన్ కో చేతుల మీదుగా పీటీ ఉష ఈ పురస్కారాన్ని అందుకుంది. దీంతో ఆసియా నుంచి ఈ అవార్డు పొందిన మూడో అథ్లెట్‌గా ఉష నిలిచింది. అథ్లెటిక్స్ ఉన్నతికి, ట్రాక్ అండ్ ఫీల్డ్‌కే వన్నె తెచ్చిన అతి కొద్ది మందికి మాత్రమే వెటరన్ పిన్‌ను అందజేస్తారు.

దిగ్గజ అథ్లెట్ ఉష తన విజయవంతమైన కెరీర్‌లో 100 మీ., 200 మీ., 400 మీ., 4x400 మీ. రిలే పరుగుతో పాటు 400 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. 1985లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఏఏఎఫ్ నుంచి వెటరన్ పిన్ పురస్కారం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : పీటీ ఉష
ఎక్కడ : దోహా, ఖతర్
ఎందుకు : అథ్లెటిక్స్ ఉన్నతికి కృషి చేసినందుకుగాను
Published date : 26 Sep 2019 08:01PM

Photo Stories