పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ కాల్పులు
Sakshi Education
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని నీలం లోయలో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ అక్టోబర్ 20న తీవ్రస్థాయిలో కాల్పులు జరిపింది.
ఈ కాల్పుల్లో జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలకు చెందిన దాదాపు 35 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత ఆర్మీ వెల్లడించింది. అలాగే మూడు ఉగ్రస్థావరాలు, ఆ స్థావరాలకు రక్షణ కల్పిస్తున్న పాక్ ఆర్మీ పోస్ట్‌లు ధ్వంసమయ్యాయని తెలిపింది. భారత్ దాడులు చేసిన సమయంలో ఒక్కో ఉగ్రస్థావరంలో 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు భారత్‌లోని కశ్మీర్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు వీలుగా అక్టోబర్ 19న జమ్మూకశ్మీర్లోని తంగధర్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు పదమ్ బహదూర్ శ్రేష్ఠ, గమిల్ కుమార్ శ్రేష్ఠ, ఒక పౌరుడు మృతి చెందారు. ప్రతీకారంగా భారత్ తాజా కాల్పులు జరిపింది.
తాజా ఘటనపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందిస్తూ... ‘ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు భారత్ కాల్పుల్లో 6 నుంచి 10 మంది పాక్ జవాన్లు, అంతే సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు’ అని అన్నారు. మరోవైపు పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందిస్తూ... భారత్ కాల్పుల్లో ఐదుగురు పౌరులు చనిపోయారని తెలిపారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో 9 మంది భారత జవాన్లు చనిపోగా, రెండు భారత బంకర్లు ధ్వంసమయ్యాయన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ కాల్పులు
ఎప్పుడు : అక్టోబర్ 20
ఎక్కడ : నీలం లోయ, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)
ఎందుకు : పాక్ చేసిన కాల్పులక ప్రతీకారంగా

Published date : 21 Oct 2019 05:25PM