Skip to main content

పీఎస్‌యూ రిఫైనరీల్లో ఎఫ్‌డీఐల పరిమితిని ఎంత శాతానికి పెంచారు?

ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్‌ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర ప్రభుత్వం జూలై 29న అనుమతినిచ్చింది.
దీనితో ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అయ్యింది. 2008 మార్చిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న చమురు రిఫైనర్‌లో ఎఫ్‌డీఐ పరిమితి 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది.

ఆయిల్, గ్యాస్‌ రంగంలో తక్షణం పెట్టుబడుల ఉపసంహరణ వరుసలో భారత్‌ రెండవ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనర్‌ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) నిలుస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో తన పూర్తి 52.98 శాతం వాటాలను విక్రయిస్తోంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ప్రభుత్వ రంగంలోని ఆయిల్, గ్యాస్‌ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి
ఎప్పుడు : జూలై 29
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ఆయా సంస్థల నుంచి ప్రభుత్వం తన మెజారిటీ వాటాల విక్రయానికి (వ్యూహాత్మక విక్రయాలు) మార్గం సుగమం అవుతుందని...
Published date : 02 Aug 2021 06:28PM

Photo Stories