Skip to main content

పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది.
Current Affairs పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 17న ఈ ప్రయోగం నిర్వహించారు. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-50.... 20.11 నిమిషాల వ్యవధిలో సీఎంఎస్-01 (జీశాట్-12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ ప్రసంగించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ-50 గురించి...
  • 44.4 మీటర్ల పొడవు గల పీఎస్‌ఎల్‌వీ సీ-50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది.
  • షార్ నుంచి ఇది 77వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

సీఎంఎస్-01 ఉపగ్రహం గురించి...
  • 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్-12 స్థానంలో సీఎంఎస్-01 (జీశాట్-12ఆర్) ఉపగ్రహం సేవలందిస్తుంది.
  • సీఎంఎస్-01 ఉపగ్రహం బరువు 1,410 కిలోలు.
  • ప్రస్తుతం ఈ ఉపగ్రహాన్ని సబ్ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. డిసెంబర్ 18 ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.

శివన్ ప్రసంగం-ముఖ్యాంశాలు
  • 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్‌గా ఉంటుంది.
  • 2021 ప్రారంభంలో పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నాం. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నాం.
  • స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తాం.
  • చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్-3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్-01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.
  • గగన్‌యాన్-01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
  • చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నాం.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎస్‌ఎల్‌వీ సీ-50 ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్, శ్రీహరికోట, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఎందుకు : సీఎంఎస్-01 (జీశాట్-12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు
Published date : 18 Dec 2020 06:37PM

Photo Stories