పీఎఫ్‌పై తాజా వడ్డీ రేటు 8.65 శాతం
Sakshi Education
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది.
పీఎఫ్ రేటును పెంచడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. 2015-16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2016-17లో 8.65 శాతానికి, అటుపై 2017-18లో అయిదేళ్ల కనిష్టమైన 8.55 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియజేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామన్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి అధిక వడ్డీ రేటు ఇవ్వాలని ట్రస్టీలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపుతాం. వారినీ ఒప్పిస్తాం‘ అని గంగ్వార్ చెప్పారు. 8.65 శాతం వడ్డీ రేటునిస్తే.. ఈపీఎఫ్ వద్ద రూ.151.67 కోట్ల మిగులు ఉంటుందని అందుకే ఈ రేటును నిర్ణయించామని ఆయన చెప్పారు. అదే 8.7 శాతం ఇస్తే రూ.158 కోట్ల లోటు ఉంటుందని తెలియజేశారు. ఈపీఎఫ్‌వోలో ప్రస్తుతం 6 కోట్ల పైచిలుకు చందాదారులున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.65 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.65 శాతం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 22 Feb 2019 05:10PM