పీఎన్‌బీతో ఎన్‌ఎఫ్‌డీబీ ఒప్పందం
Sakshi Education
జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్‌ఎఫ్‌డీబీ).. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం కింద మత్స్య పరిశ్రమలకు పీఎన్‌బీ ద్వారా రుణ సాయం లభించనుంది. మత్స్య రంగంలో సామర్థ్యం ఉండీ, అంతగా వెలుగుచూడని పరిశ్రమలకు ఎఫ్‌ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను పీఎన్‌బీతో ఒప్పందం వీలు కల్పిస్తుందని ఎన్‌ఎఫ్‌డీబీ సీఈవో సువర్ణ చంద్రప్పగిరి తెలిపారు. హైదరాబాద్‌లో ఆగస్టు 5న జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సువర్ణ చంద్రప్పగిరి, పీఎన్‌బీ ఎండీ, సీఈవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)తో అవగాహన ఒప్పందం
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్‌ఎఫ్‌డీబీ)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : మత్స్య రంగ పరిశ్రమలకు ఎఫ్‌ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను...

Published date : 06 Aug 2021 06:07PM