Skip to main content

పీఎంయూ కాల్‌సెంటర్‌ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 10న తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.
Current Affairs
దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా పీఎంయూ కాల్‌సెంటర్‌ పనిచేస్తుంది. పీఎంయూలో200 మంది సిబ్బంది పనిచేస్తారు. మొదటగా నాలుగు రకాల సేవలపై పర్యవేక్షణను అమల్లోకి తెచ్చారు. అక్టోబర్‌ నుంచి 543రకాలకుపైగా సేవలపై పీఎంయూ దృష్టి సారించనుంది. సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు వెల్లడించాలని సీఎం పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు:నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల పరిష్కారం, అమలును పర్యవేక్షించేందుకు
Published date : 12 Aug 2020 09:57PM

Photo Stories