Skip to main content

పీఎంకేఎస్‌ఎస్ పరిధిలోకికొత్తగా 2 కోట్ల రైతులు

రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి(పీఎంకేఎస్‌ఎస్) పథకం పరిధిలోకి కొత్తగా 2 కోట్ల మంది రైతులను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మే 31న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. 2 హెక్టార్లలోపు వ్యవసాయ భూమి ఉండే 12.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల కోసం మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. తాజా కేబినెట్ భేటీలో ఈ 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) కేంద్రం ఎత్తివేసింది. దీంతో మొత్తం 14.5 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాపై భారం ఏటా రూ.75,000 కోట్ల నుంచి రూ.87,217.50 కోట్లకు చేరుకోనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పీఎంకేఎస్‌ఎస్ పరిధిలోకి కొత్తగా 2 కోట్ల రైతులు
ఎప్పుడు : మే 31
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : 2 హెక్టార్ల పరిమితిని(మినహాయింపులకు లోబడి) ఎత్తివేయడం ద్వారా
Published date : 01 Jun 2019 05:27PM

Photo Stories