పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
Sakshi Education
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ యోజన) పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా పథకానికి సంబంధించిన మొబైల్ యాప్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫిబ్రవరి 24న ఢిల్లీలో ప్రారంభించారు.
పథకం సేవలు మరింత విసృ్తం చేసేందుకు ఈ యాప్‌ను ఆవిష్కరించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయం 2022 కల్లా రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
14 కోట్ల మంది రైతులకు...
పీఎం-కిసాన్ పథకాన్ని పశ్చిమ బెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. 14 కోట్ల మంది రైతులకు ఈ పథకం చేరాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 9.74 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారు. అందులో 8.45 కోట్ల మంది రైతులకు చెల్లింపులు చేసినట్లు అధికారికంగా నమోదైంది.
గోరఖ్‌పూర్‌లో ప్రారంభం...
ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందించేందకు ఉద్దేశించిన పీఎం-కిసాన్ పథకంను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 2019, ఫిబ్రవరి 24న జరిగిన ఈ కార్యక్రమంలో తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000ను మోదీ బదిలీ చేశారు. పీఎం-కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్(ఓట్ ఆన్ అకౌంట్)లో ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పీఎం కిసాన్ మొబైల్ యాప్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : పీఎం-కిసాన్ యోజన పథకం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్భంగా

Published date : 25 Feb 2020 05:58PM