Skip to main content

పెద్దపల్లి జిల్లా స్వచ్ఛత దర్పణ్ అవార్డు

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు ‘స్వచ్ఛత దర్పణ్ అవార్డు’ లభించింది.
Current Affairsన్యూఢిల్లీలో జనవరి 12న జరిగిన కార్యక్రమంలో పాణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత సాధించినందుకుగాను జిల్లాకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ), సామాజిక మరుగుదొడ్లు’ అనే అంశంపై పెద్దపల్లి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్వచ్ఛత దర్పణ్ అవార్డు విజేత
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : పెద్దపల్లి జిల్లా
ఎందుకు : పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 14 Jan 2020 04:19PM

Photo Stories