Skip to main content

పదవిలో ఉండగా కరోనాతో మరణించిన మొదటి కార్యదర్శి?

కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్‌ ట్రేడ్‌ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్‌ మొహపాత్ర (59) కన్నుమూశారు.
Current Affairs కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన జూన్‌19న మరణించారని ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రకటించింది. పదవిలో ఉండగా కరోనా కారణంగా మరణించిన మొదటి కార్యదర్శి మొహపాత్రనే. గుజరాత్‌ కేడర్‌కు చెందిన గురుప్రసాద్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి.

యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన మాజీ ఐఏఎస్‌?
ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్‌ అధికారి, ఎమ్మెల్సీ ఏకే శర్మను పార్టీ అధిష్టానం నియమించింది. యూపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌ జూన్‌ 19న ఈ మేరకు ప్రకటించారు. గుజరాత్‌లో ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన ఏకే శర్మ..వైబ్రంట్‌ గుజరాత్‌ తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అప్పటి సీఎం నరేంద్ర మోదీకి దగ్గరయ్యారు. కాగా, ఏకే శర్మ యూపీలోని మావ్‌ ప్రాంతానికి చెందిన వారు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : కేంద్ర పరిశ్రమలు, ఇంటర్నల్‌ ట్రేడ్‌ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి కన్నుమూత
ఎప్పుడు : జూన్‌ 19
ఎవరు : గురుప్రసాద్‌ మొహపాత్ర (59)
ఎక్కడ : న్యూఢిల్లీ ఎయిమ్స్‌
ఎందుకు : కరోనా సంబంధిత సమస్యలతో
Published date : 21 Jun 2021 07:41PM

Photo Stories