పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Sakshi Education
కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (సోమవారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
‘నెవర్ బిఫోర్’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి.
చరిత్రలో తొలిసారి...
కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్‌ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా, మేడ్‌ఇన్ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Published date : 01 Feb 2021 11:16AM