పారిశ్రామికవేత్త ప్రత్యూషకు నీతీ ఆయోగ్ అవార్డు
Sakshi Education
హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త ప్రత్యూష పారెడ్డికి ‘నీతీ ఆయోగ్ మహిళా అవార్డు’ లభించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఢిల్లీలో నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘విమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’-2019 సంవత్సరానికి గాను ఈ అవార్డులను అంద జేశారు. భారత్‌లో మార్పును తెస్తున్న మహిళలు అనే అంశం కింద 16 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. 2017లో నెమో కేర్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన ప్రత్యూష శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేశారు. నవజాత శిశువుల ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే కార్యక్రమాలు చేపట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతీ ఆయోగ్ మహిళా అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ప్రత్యూష పారెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తున్నందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతీ ఆయోగ్ మహిళా అవార్డు విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ప్రత్యూష పారెడ్డి
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శిశు మరణాలను తగ్గించడానికి విశేషంగా కృషి చేస్తున్నందుకు
Published date : 10 Mar 2020 06:55PM